అంతర్జాతీయం
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: న్యూజిలాండ్‌పై భారత్ సంచలన విజయం
దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి చాంపియన్స్ ట్రోఫీని మరోసారి తన ఖాతాలో వేసుకుంది. 12 సంవత్సరాల తర్వాత భారత్ ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని సాధించడం విశేషం.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన భారత్, ఇంకా ఆరు బంతులు మిగిలుండగానే ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత జట్టు కీలక ప్రదర్శన:
కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో భారత్ విజయానికి బాటలు వేశాడు. శ్రేయాస్ అయ్యర్ 48, కేఎల్ రాహుల్ 34, శుభమన్ గిల్ 31, అక్షర్ పటేల్ 29, హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేశారు. చివర్లో రవీంద్ర జడేజా (9 నాటౌట్) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. విరాట్ కోహ్లీ కేవలం 1 పరుగుకే అవుట్ కావడం నిరాశపరిచింది.
భారత్ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా:
ఈ విజయంతో భారత్ మూడోసారి చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. 2002లో శ్రీలంకతో సంయుక్త విజేతగా నిలిచిన భారత్, 2013లో ఇంగ్లండ్‌ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
న్యూజిలాండ్ బ్యాటింగ్:
కివీస్ తరఫున డారిల్ మిచెల్ 63, బ్రాస్‌వెల్ 53 పరుగులతో రాణించారు. రచిన్ రవీంద్ర 37, ఫిలిప్స్ 34 పరుగులు చేయగా, విల్ యంగ్ 15, కేన్ విలియమ్సన్ 11, టామ్ లేథమ్ 14, మిచెల్ శాంట్నర్ 8 పరుగులు చేశారు. నాథన్ స్మిత్ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు.
భారత బౌలర్లు రాణింపు:
కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో టీమిండియా మరోసారి తన ఛాంపియన్ స్థాయిని నిరూపించుకుంది.”